NEWSNATIONAL

సంజ‌య్ రౌత్ కు 15 రోజుల జైలు శిక్ష

Share it with your family & friends

సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించిన కోర్టు

మ‌హారాష్ట్ర – శివ‌సేన యూబీటీ నేత , రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ కు బిగ్ షాక్ త‌గిలింది. ప‌రువు న‌ష్టం కేసులో ఆయ‌న‌కు కోర్టు 15 రోజుల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన నేత కిరీటి సోమ‌య్య భార్య సంజ‌య్ రౌత్ కు వ్య‌తిరేకంగా ప‌రువు న‌ష్టం కేసు దాఖ‌లు చేసింది.

ఈ కేసును విచారించిన ముంబై కోర్టు గురువారం సంజ‌య్ రౌత్ ను దోషిగా నిర్దారించింది. ఈ మేర‌కు జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉండ‌గా శివ‌సేన యూబీటీ నాయ‌కుడు సంజ‌య్ రౌత్ త‌న‌పై, త‌న భ‌ర్త‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేశార‌ని ఆరోపించింది. రూ. 100 కోట్ల స్కామ్ లో ప్రమేయం ఉందంటూ ఆరోపించింది.

భార‌తీయ శిక్షాస్మృతి లోని సెక్ష‌న్ 500 కింద సెవ్రీ కోర్టులో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సంజ‌య్ రౌత్ ను దోషిగా నిర్దారించింది. అంతే కాకుండా రూ. 25,000 జ‌రిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇదిలా ఉండ‌గా తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు బీజేపీ నేత మేడా సోమ‌య్య‌. త‌న‌తో పాటు కుటుంబంపై చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్పు అని ఈ తీర్పుతో తేలి పోయింద‌న్నారు. చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

ఎవ‌రు నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసినా వారికి ఈ తీర్పు క‌నువిప్పు క‌లిగిస్తుంద‌ని తాను భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు . మున్సిప‌ల్ ప‌రిధిలో ప‌బ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి రూ. 100 కోట్ల స్కామ్ జ‌రిగిందంటూ త‌న‌తో పాటు త‌న భార్య‌పై సంజ‌య్ రౌత్ చేశార‌ని తెలిపారు.