విద్యతోనే వికాసం భవిష్యత్తుకు సోపానం – అనుర
శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడు దిసనాయకే
శ్రీలంక – శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడు అనుర కుమార దిస నాయకే జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్య ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ దేశంలో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలకు నాణ్యమైన పాఠశాలలు, విద్యను అందించే హక్కు ఉంది. అందరికీ అద్భుతమైన విద్యను అందించడం ద్వారా రాబోయే తరం భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రకటించారు అమర కుమార దిసనాయకే.
విజ్ఞానంతో పాటు నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా మన దేశంలోని యువ తరానికి మంచి భవిష్యత్తును నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు శ్రీలంక అధ్యక్షుడు.
“సింహళీయులు, తమిళులు, ముస్లింలు, బర్గర్లు లేదా మలయ్‌లు అనే తేడా లేకుండా, మనందరం శ్రీలంక పౌరులం అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే ఆచరణాత్మక వాతావరణాన్ని సృష్టించే వరకు మన దేశం అభివృద్ధి చెందదన్నారు”
దశాబ్దాలుగా మా వాణిని వింటూ, తాము ప్రతిపాదించిన కార్యక్రమాలకు ప్రాణం పోసిన ఈ దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పారు అమర కుమార దిస నాయకే.