పాఠశాల నిర్మాణం జన్మ ధన్యం – కేటీఆర్
గ్రామాభివృద్దికి సహకరిస్తూనే ఉంటా
రాజన్న సిరిసిల్ల జిల్లా – భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్య ప్రాధాన్యత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యతోనే వికాసం అలవడుతుందన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో తన అమ్మమ్మ, తాతయ్య లక్ష్మి, కేశవరావు జ్ఞాపకార్థం తన సొంత నిధులతో పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ సందర్బంగా కేటీఆర్ భవనాన్ని ప్రాంరభించారు.
అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కేటీఆర్. రోజు రోజుకు సాంకేతిక పరంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. మా అమ్మమ్మ, తాతయ్య ఎక్కడ ఉన్నా వారు సంతోషంగా ఉంటారని అన్నారు.
కొదురుపాక మనవడిగా ఈ గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు మాజీ మంత్రి. కార్పొరేటర్ స్కూల్ కు ధీటుగా అత్యంత అధునాతన సౌకర్యాలతో అద్భుతంగా నిర్మించేందుకు సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు కేటీఆర్.
ఇదిలా ఉండగా పాఠశాలను 2 ఫోర్లు నిర్మించారు. ఇందులో మొత్తం 18 తరగతి గదులు ఉన్నాయి. వంట గదితో పాటు భోజనం కోసం డైనింగ్ హాల్, కంప్యూటర్ శిక్షణ కోసం గదులు, చుట్టూ ప్రహరీని నిర్మించారు.