సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి
సనాతన ధర్మాన్ని విమర్శిస్తే ఊరుకోం
హైదరాబాద్ – జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ నిప్పులు చెరిగారు. నటుడు ప్రకాశ్ రాజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సనతాన ధర్మాన్ని కించ పరిచేలా, హిందువుల, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడటం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు . ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న కల్తీ వివాదపై స్పందించారు. ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకున్న తమ పార్టీ చీఫ్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా గురువారం హైదరాబాద్ లో సంఘీభావం ప్రకటిస్తూ ఆందోళన చేపట్టారు శంకర్ గౌడ్.
హిమాయత్ నగర్ లోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన తెలంగాణ పార్టీ చీఫ్ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగం ఆధ్‌వర్యంలో ఆలయ శుద్ది, మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు నేమూరి శంకర్ గౌడ్. సనాతన ధర్మం గురించి తెలుసు కోకుండా కామెంట్స్ చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఈ సందర్బంగా ప్రకాశ్ రాజ్ మౌనంగా ఉంటే మంచిదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ , జనసేన వీర మహిళ విభాగం చైర్మన్ మండపాక కావ్య , గ్రేటర్ జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ నందగిరి సతీష్, ఉప్పల్ ఇంచార్జ్ నిహారిక , కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ వేముల కార్తీక్, పటాన్ చెరువు నియోజకవర్గం ఇంచార్జ్ యడమ రాజేష్, శేర్లింగంపల్లి ఇంచార్జ్ మాధవరెడ్డి, ఖమ్మం ఇన్చార్జ్ మిరియాల రామకృష్ణ, సురేష్ రెడ్డి , వెంకటాచారి, బిట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.