NEWSTELANGANA

ఖ‌నిజ ప‌రిశ్ర‌మ అభివృద్దికి స‌హ‌క‌రించండి

Share it with your family & friends

పిలుపునిచ్చిన మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క

అమెరికా – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న అమెరికా లోని లాస్ వేగాస్ లో జ‌రిగిన మైనింగ్ ఎక్స్ పో -2024లో పాల్గొన్నారు. వాటిని సంద‌ర్శించి సంతృప్తిని వ్య‌క్తం చేశారు .

ప్ర‌ధానంగా మైనింగ్ (గ‌నుల‌) రంగంలో ప్ర‌పంచ స్థాయి సాంకేతిక‌త‌కు పేరు పొందిన ప‌లు దిగ్గ‌జ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో భేటీ కావ‌డం మ‌రింత ఆనందం క‌లిగించింద‌ని పేర్కొన్నారు. గురువారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

రాష్ట్రంలో ఖనిజ పరిశ్రమ అభివృద్ధికి దోహద పడేలా అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయాలని అమెరికా కంపెనీలను ఆహ్వానించారు. దీని వ‌ల్ల ఎంతో మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.

ఇదే స‌మ‌యంలో సింగరేణికి క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ అన్వేష‌ణ రంగంలో సహాయ సహకారాలు కోరుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువుగా ఉన్న పలు అంశాలను వారికి వివరించారు.

అగ్రశ్రేణి పరిశ్రమ నాయకులతో నిమగ్నం కావ‌డం. కీలకమైన ఖనిజాల అన్వేషణలో విప్లవాత్మక మార్పులు, తెలంగాణ నాల్గవ నగరాన్ని నిర్మించడంలో త‌మ‌తో భాగస్వామిగా ఉండటానికి అమెరికన్ వ్యాపారాలను ఆహ్వానిస్తున్నామ‌ని అన్నారు.