కేంద్రంపై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్
అసెంబ్లీలో మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్
ఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. గురువారం శాసన సభలో ప్రసంగించారు. కేంద్రం కావాలని తనపై కక్ష కట్టిందని ఆరోపించారు .
బెయిల్ కూడా రాని విధంగా తనపై చట్టాన్ని విధించారని ఆవేదన వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ , ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాల త్రయం తనను టార్గెట్ చేసిందని అన్నారు.
తనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ లను కావాలని జైల్లో పెట్టాలని నిప్పులు చెరిగారు. బెయిల్ రాకుండా చేసినా చివరకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చామని చెప్పారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసి నిజాయితీగా భావిస్తేనే ఓటు వేయమని ప్రజలను కోరానని అన్నారు అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ, ఆర్ఎస్ నేతలు తనను బద్నాం చేసినా ఒరిగేది ఏమీ ఉండదన్నారు.
ఢిల్లీ అభివృద్దిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని కానీ ప్రజలు తనను , తమను ఆదరిస్తూనే ఉన్నారని వారికి రుణపడి ఉన్నామని చెప్పారు మాజీ సీఎం.