ENTERTAINMENT

దేవ‌ర ఉత్కంఠ ఫ్యాన్స్ పండుగ‌

Share it with your family & friends

ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ

హైద‌రాబాద్ – ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు..గ‌ట్స్ ఉన్న హీరో క‌లిస్తే సినిమా ఎలా ఉంటుందో ఊహించ గ‌ల‌మా. అదే ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతోంది డైన‌మిక్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో, క‌సితో తీసిన దేవ‌ర చిత్రం సెప్టెంబ‌ర్ 27న శుక్ర‌వారం విడుద‌ల‌వుతోంది.

భారీ ఎత్తున అంచ‌నాల మ‌ధ్య ప్రిమీయ‌ర్ షోలు ప్రారంభ‌మ‌య్యాయి. ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే దేవ‌ర చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా కొర‌టాల శివ అంటే ద‌మ్మున్నోడు. ఆ మ‌ధ్య‌న చిరంజీవితో తీసిన ఆచార్య ఫ్లాప్ అయినా ..ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా తీశాడు తార‌క్ తో దేవ‌ర‌.

ఇందులో దివంగ‌త అందాల న‌టి శ్రీ‌దేవి ముద్దుల కూతురు జాహ్న‌వి క‌పూర్ ఇందులో కీల‌క పాత్ర చేస్తోంది. అంతే కాదు బాలీవుడ్ లో ప్ర‌ముఖ న‌టుడిగా పేరు పొందిన సైఫ్ అలీ ఖాన్ ప్ర‌తి నాయ‌కుడి క్యారెక్ట‌ర్ చేశాడు. తార‌క్, జాహ్న‌వి, సైఫ్ తో పాటు విల‌క్ష‌ణ ప్ర‌తిభావంత‌మైన న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఇందులో ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో న‌టించ‌డం విశేషం.

ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ త‌ర్వాత వ‌స్తున్న చిత్రం దేవ‌ర‌. దీంతో నంద‌మూరి తార‌క్ అభిమానులు ఎంతో ఆతృత‌తో, ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.