NEWSTELANGANA

బాధ్య‌త‌తో మెల‌గండి ప్ర‌జా సేవ చేయండి – సీఎం

Share it with your family & friends

ఉద్యోగుల‌కు అనుముల రేవంత్ రెడ్డి పిలుపు

హైద‌రాబాద్ – ఉద్యోగం అనేది వేత‌నం కోసం కాద‌ని అది అత్యంత సామాజిక బాధ్య‌త‌తో కూడుకుని ఉన్న‌ద‌ని గుర్తించాల‌ని స్ప‌ష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

నీటి పారుదల శాఖలో నూతనంగా ఏఈఈ లుగా ఎంపికైన వారికి జల సౌధాలో ఉద్యోగ నియామక పత్రాలు సీఎం అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి రావ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. దీనిని స‌వాల్ గా తీసుకోవాల‌ని అన్నారు సీఎం.

ఈ కొలువులను కేవలం బాధ్యతగా చూడకండి… స్వరాష్ట్రంతో పెన వేసుకున్న భావోద్వేగంగా చూడాల‌ని కోరారు ఎ. రేవంత్ రెడ్డి.

నూతన ఇంజనీర్లు పోస్టుల మీద కాదు ..పని మీద దృష్టి పెట్టాలని అన్నారు. కాళేశ్వరం ఒక మోడల్ స్టడీగా అధ్యయనం చేయాల‌ని సూచించారు తెలంగాణ సీఎం.

లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఎందుకు నిరుపయోగంగా మారిందో నూతన ఇంజనీర్లు అధ్యయనం చేయాలని అన్నారు.

ప్రతి నిర్ణయం చేసే ముందు ..నివేదికలు ఇచ్చే ముందు క్షేత్ర పరిశీలన త‌ప్ప‌నిస‌రిగా చేయాల‌ని హిత‌వు ప‌లికారు. అసంపూర్తి ప్రాజెక్టులు పూర్తి చేస్తే సాగు రంగంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా నిలబడుతుందని అన్నారు.