మంత్రి పొంగులేటికి ఈడీ బిగ్ షాక్
16 చోట్ల సోదాలు చేపట్టిన బృందాలు
హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ వ్యాపారవేత్త, కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆధ్వర్యంలో బృందాలు శుక్రవారం ఉదయమే హైదరాబాద్ కు వచ్చాయి.
మంత్రి పొంగులేటికి సంబంధించిన ఆఫీసులు, ఇళ్లపై దాడులు చేయడం మొదలు పెట్టారు ఈడీ అధికారులు. విచిత్రం ఏమిటంటే ఢిల్లీ నుంచి 16 టీమ్ లు రావడం విస్తు పోయేలా చేసింది. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా పొంగులేటి ఇళ్లు, ఆఫీసులపై సోదాలు జరిగాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కుడి భుజంగా ఉన్నారు. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి ఈడీ బిగ్ షాక్ ఇవ్వడంతో పార్టీ పరంగా ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
పొంగులేటిపై దాడులు చేస్తూ మరో వైపు సీఎంకు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందా అన్న ఆరోపణలు లేక పోలేదు. ఇదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుడిపై కేసు నమోదైంది. ఆయన అక్రమంగా వాచ్ ను కొనుగోలు చేశారని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
దాని ధర భారీ గా ఉండడం విస్తు పోయేలా చేసింది. కొడుకును వాచీల స్మగ్లింగ్ కేసులో ఇరికించారు. మొత్తంగా మీద నిన్న కర్ణాటకలో సీఎం సిద్దరామయ్యకు షాక్ తగిలితే ఇవాళ పొంగులేటి రూపంలో మరో షాక్ తగలడం విశేషం.