భావోద్వేగాలను రెచ్చగొడితే ఎలా..?
నటుడు ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై భగ్గుమంటున్నారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై తాను అన్నది ఏంటి..మీరు చెబుతున్నది ఏమిటో చెప్పాలంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం తాను షూటింగ్ లో ఉన్నానని, ఆ పని అయ్యాక తీరికగా సెప్టెంబర్ 30న వస్తానని , అప్పుడు పవన్ కళ్యాణ్ లేవదీసిన ప్రతి ప్రశ్నకు తాను సమాధానం ఇస్తానని ప్రకటించారు.
ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా తెలిపారు కూడా. తాజాగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. శుక్రవారం ఎక్స్ లో సీరియస్ కామెంట్స్ చేశారు ప్రకాశ్ రాజ్.
మనకేం కావాలి..ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి..తద్వారా రాజకీయ లబ్దిని సాధించడామా అని ప్రశ్నించారు. లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా ..పరిపాలనా సంబంధమై..అవసరమైతే తీవ్రమైన చర్యలతో..సున్నితమైన సమస్యను పరిష్కరించు కోవడమా…? అంటూ నిలదీశారు. మొత్తంగా తాజాగా చేసిన ట్వీట్ సినీ, రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది.