హిందువులంటే బీజేపీ కార్యకర్త లేనా – భూమన
జగన్ రెడ్డిని చూసి సర్కార్ జడుసుకుంటోంది
తిరుపతి – భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందువులంటే బీజేపీ కార్యకర్తలేనా అని ప్రశ్నించారు. ఈ దేశంలో 143 కోట్ల మంది ప్రజలు ఉన్నారనే విషయం మరిచి పోతే ఎలా అని నిలదీశారు మాజీ టీటీడీ చైర్మన్.
తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే శ్రీవారిని దర్శించు కోవాలని చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఆమెతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డి పట్ల చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. జగన్ మోహన్ రెడ్డిని చూసి ఏపీ కూటమి సర్కార్ జడుసు కుంటోందని స్పష్టం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి.
జగన్ రెడ్డిని డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం పతనం చెందడం ఖాయమని జోష్యం చెప్పారు. బీజేపీ చెప్పిన వారే హిందువులా అని అన్నారు. జగన్ ను అడ్డుకునే హక్కు టీడీపీకి లేదన్నారు. జగన్ రెడ్డి ఎన్నోసార్లు తిరుమలకు వచ్చారని, ఏనాడూ డిక్లరేషన్ ఇవ్వాలని కోరలేదన్నారు. కానీ ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు భూమన కరుణాకర్ రెడ్డి.