NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ శ్రీ‌వారి ద‌ర్శ‌నంపై ఆంక్షలు త‌గ‌దు – అంబ‌టి

Share it with your family & friends

ఏపీ మాజీ మంత్రి రాంబాబు సీరియ‌స్ కామెంట్స్

గుంటూరు జిల్లా – ఏపీ మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు సీరియ‌స్ అయ్యారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రోజు రోజుకు ప‌రిస్థితులు దిగ జారి పోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ పార్టీ బాస్, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎప్ప‌టి లాగే తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని ద‌ర్శించాల‌ని అనుకున్నార‌ని, శ్రీ‌వారిని మొక్కాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు.

ఇప్ప‌టికే పోలీసుల‌కు కూడా స‌మాచారం ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ ఈ దేశంలో ఏపీ లేన‌ట్టుగా ప్ర‌స్తుతం పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు. అస‌లు స్వామి వారిని ఎవ‌రైనా ద‌ర్శించు కోవ‌చ్చ‌ని, ఆయ‌న కొంద‌రి వాడు కాదు అంద‌రి వాడ‌ని అన్నారు అంబ‌టి రాంబాబు.

కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దర్శించు కోవడానికి ఎవరి అనుమతి కావాలి అని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి.

ఆరుగురితో శ్రీవారి దర్శనానికి వెళ్లాలని వైయస్ జగన్ అనుకున్నారని తెలిపారు. కానీ ఆయన వెంట ఎవరూ వెళ్ల కూడదంటూ త‌మ‌ నాయకులకి పోలీసులు నోటీసులు ఇవ్వ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు అంబ‌టి రాంబాబు. ఇంత విచిత్రమైన పరిస్థితిని రాష్ట్రంలో తాను ఎప్పుడూ చూడలేదని మండిప‌డ్డారు.