NEWSANDHRA PRADESH

డిక్ల‌రేష‌న్ పేరుతో బాబు రాజ‌కీయం – జ‌గ‌న్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి

అమ‌రావ‌తి – ఏపీ మాజీ సీఎం, వైసీపీ బాస్ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను టీటీడీ వెళ్ల‌డంపై తెలుగుదేశం పార్టీ కూట‌మి ప్ర‌భుత్వం కావాల‌ని రాద్దాంతం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. గ‌తంలో లేని రూల్స్ ఇప్పుడు ఎందుకు వచ్చాయ‌ని ప్ర‌శ్నించారు.

ఓ వైపు త‌న‌ను మ‌రో వైపు వైసీపీ శ్రేణుల‌ను తిరుమ‌ల‌కు వెళ్ల నీయ‌డం లేద‌ని ఆరోపించారు. త‌మ పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లకు నోటీసులు ఇచ్చి వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్ రెడ్డి. అంతే కాదు చుట్టు ప్రక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్లను తిరుమలకు ర‌ప్పిస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు .

టాపిక్‌ డైవర్ట్‌ చేయడం కోసం ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారని నిల‌దీశారు. అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బ తీశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇప్పుడు డిక్లరేషన్‌ పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

తిరుమల విశిష్టతను, ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బ తీస్తున్నారని వాపోయారు. జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ముఖ్యమంత్రే సాక్షాత్తూ తిరుమలను దగ్గరుండి అపవిత్రం చేసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం దారుణ‌మ‌న్నారు. నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకోసారి రోటీన్‌గా జరిగే కార్యక్రమం అన్నారు. 100 రోజుల పాలనను డైవర్ట్‌ చేయడానికే లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వ‌చ్చారంటూ ఎద్దేవా చేశారు జ‌గ‌న్ రెడ్డి.