NEWSANDHRA PRADESH

స‌భ్య‌త్వ న‌మోదుపై ఫోక‌స్ పెట్టాలి

Share it with your family & friends


పిలుపునిచ్చిన పురుందేశ్వ‌రి

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌భ్వ‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం మ‌రింత ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ , రాజ‌మండ్రి ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి. శుక్ర‌వారం బీజేపీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంతో పాటు పార్టీ ప‌నితీరుపై స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది.

ఈ కీల‌క స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు పార్టీ చీఫ్ , ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ పార్టీ స‌భ్య‌త్వం న‌మోదు ప్ర‌క్రియ యుద్ద ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేశారు.

పార్టీ ప‌రంగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని చెప్పారు. నిబ‌ద్ద‌త క‌లిగిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు స‌ముచిత స్థానం త‌ప్ప‌క ఉంటుంద‌న్నారు. ఇప్ప‌టికే ప‌లు కీల‌క ప‌ద‌వుల‌లో నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్టాల‌ని పిలుపునిచ్చారు ద‌గ్గుబాటి పురందేశ్వరి. ఇదే స‌మ‌యంలో స‌భ్య‌త్వ న‌మోదులో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్ కు చేరుకోవాల‌ని స్ప‌ష్టం చ‌స్త్రశారు బీజేపీ రాష్ట్ర చీఫ్‌.