ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది – జగన్ రెడ్డి
సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్
అమరావతి – ఏపీ అసలు ఈ భారత దేశంలోనే ఉందా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు వైసీపీ బాస్, మాజీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు నూరైనా ఎవరు అడ్డుకున్నా సరే తాను తిరుమలకు వెళ్లడం ఖాయమని ప్రకటించారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తాము ప్రజాస్వామ్య బద్దంగా ముందు సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే తన తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నాడని ఆరోపించారు.
ప్రధానంగా పోలీసులతో తమ పార్టీకి చెందిన నేతలు, శ్రేణులను నోటీసులు ఇచ్చి భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు జగన్ మోహన్ రెడ్డి. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందన్నారు. ఇది భారత రాజ్యాంగం కల్పించిందని, ఆ విషయం చంద్రబాబు తెలుసుకుంటే మంచిదన్నారు.
తిరుమల పేరుతో చిల్లర రాజకీయాలకు తెర లేపాడని, ఓ వైపు ఈవో తిరుపతి లడ్డూ కల్తీ కాలేదని చెబుతుంటే మరో వైపు అయ్యిందంటూ ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు జగన్ రెడ్డి.