NEWSTELANGANA

జీహెచ్ఎంసీ ప‌రిధిలో పోస్టర్లు బంద్

Share it with your family & friends

క‌మిష‌న‌ర్ ఆమ్ర‌పాలి షాకింగ్ నిర్ణ‌యం

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ఆమ్ర‌పాలి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. శుక్ర‌వారం ఈ మేర‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. గ‌త కొంత కాలంగా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పోస్ట‌ర్లు, బారికేడ్లు ద‌ర్శ‌నం ఇస్తున్నాయ‌ని ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఎవ‌రు ప‌డితే వారు పోస్ట‌ర్లు వేయ‌డం వ‌ల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్ప‌డుతోంది.

ప్ర‌ధానంగా సినిమాలు రిలీజ్ స‌మ‌యంలో, పొలిటిక‌ల్ లీడ‌ర్లకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు ఉండ‌డంతో ఇష్టానుసారంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో పోస్ట‌ర్లు వేసుకుంటూ పోవ‌డంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. దీనిని గ‌మ‌నించిన జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఇందులో భాగంగా గ్రేటర్ హైద‌రాబాద్ ప‌రిధిలో పోస్టర్లు బ్యాన్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. వాల్ పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్ పై సీరియస్ గా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ మేర‌కు సర్క్యులర్ జారీ చేశారు ఆమ్ర‌పాలి.

సినిమా థియేటర్ వాళ్ళు కూడ ఎక్కడా కూడా పోస్టర్లు అతికించకుండ చూడాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించింది క‌మిష‌న‌ర్. ఒక‌వేళ కాద‌ని పోస్ట‌ర్లు అతికించినా లేదా ఏర్పాటు చేసినా వెంట‌నే పెనాల్టీలు వేయాల‌ని ఆదేశించారు. లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.