జగన్ నిర్వాకం ఆలయాలు నిర్లక్ష్యం – సీఎం
నిప్పులు చెరిగిన నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిల్లర రాజకీయాలు చేసింది ఎవరో ప్రజలకు బాగా తెలుసన్నారు.
పవిత్రమైన తిరుమల పుణ్య క్షేత్రంపై లేనిపోని అభాండాలు వేయడం మానుకోవాలని హితవు పలికారు జగన్ రెడ్డికి బాబు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తాము ఏనాడూ జగన్ రెడ్డిని తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోలేదని, ఆ ప్రయత్నం ఎందుకు చేస్తామని ప్రశ్నించారు.
తానే దీనిని రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నాడని, దీనిని ప్రజలతో పాటు భక్తులు కూడా గమనిస్తున్నారని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. విచిత్రం ఏమిటంటే తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనే జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు .
ఇదే విషయం ఈవో చెప్పారని లాగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఏఆర్ డెయిరీ నుంచి 8 ట్యాంకర్ల నెయ్యి వచ్చిందని, ఇందులో నాలుగు ట్యాంకర్లు మాత్రమే వాడారని, ఎన్డీబీబీ ఇచ్చిన నివేదికనే తప్పు పట్టడం దీనిని ఎలా అర్థం చేసుకోవాలో జగనే చెప్పాలన్నారు సీఎం.
వైసీపీ జగన్ రెడ్డి హయాంలో హయాంలో తిరుమలలో నాసిరకం భోజనాలు పెట్టారని, రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు.