DEVOTIONAL

అన్న ప్ర‌సాదం..పారిశుధ్యంపై దృష్టి సారించాలి

Share it with your family & friends

శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఈవో సమీక్ష

తిరుమల – తిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వారం కంటే తక్కువ సమయం ఉన్నందున, తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల ఏర్పాట్లను, టీటీడీలోని అన్ని విభాగాలపై టీటీడీ ఈవో జె శ్యామలరావు స‌మీక్షించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాల తుది సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, అన్ని శాఖల ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండ కూడదని స్ప‌ష్టం చేశారు ఈవో జె శ్యామ‌ల రావు. అన్నప్రసాదం, ఆరోగ్య (పారిశుద్ధ్యం) విభాగాలు అత్యంత ముఖ్య‌మైన‌వ‌ని పేర్కొన్నారు.

రెండు ముఖ్యమైన విభాగాలుగా ఒక దానితో మ‌రొక‌టి సమన్వయం చేసుకుని దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

“అన్నప్రసాదం వడ్డించడం పూర్తయిన వెంటనే, చెత్తను తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఆలస్యం చేయకుండా ఆరోగ్య శాఖ పారిశుధ్య కార్మికులను ఆదేశించాలని అని ఆయన సూచించారు.

అనంతరం ఇంజినీరింగ్‌ పనులు, శ్రీవారి ఆలయం, విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ, గార్డెన్ ,ఫారెస్ట్‌లు, నృత్యం, భజన బృందాలు, రవాణా, గోశాల, మెడికల్‌ విభాగాలను ఈవో పరిశీలించారు. శ్రీవారి సేవకుల సేవలను ఆయా విభాగాలు సక్రమంగా వినియోగించు కోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డిఎల్ వో వరప్రసాద్, సిఈ సత్యనారాయణ, ఎఫ్ఎసిఎఓ బాలాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.