NEWSANDHRA PRADESH

స‌భ్య‌త్వ న‌మోదుపై దృష్టి సారించాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి

అమ‌రావ‌తి – భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. భారీ ఎత్తున కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నార‌ని ఈ సంద‌ర్బంగా అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి. భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి , స‌త‌స్య‌తా అభియాన్ రాష్‌ట్ర ఇంఛార్జి అర‌వింద్ మీన‌న్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఏపీ బీజేపీ స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ‌పై ఎక్కువ‌గా దృష్టి సారించ‌డం ప‌ట్ల ప్ర‌త్యేకంగా ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని అభినందించారు. ఇదే జోరును ఇక ముందు కూడా కొన‌సాగించాల‌ని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

తాజాగా జ‌రిగిన శాస‌న స‌భ‌, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బ‌లం పుంజుకుందన్నారు. ఇదే స‌మ‌యంలో పార్టీ కోసం ముందు నుంచి క‌ష్ట ప‌డిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ మీనన్.

దేశంలోనే ఏపీ స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిల‌వాల‌ని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. సిద్దార్థ్ ఎన్ సింగ్ , పీకే కృష్ణ దాస్ తో పాటు కీల‌క నేత‌లు పాల్గొన్నారు.