జగన్ కామెంట్స్ సత్య కుమార్ సీరియస్
దైవం పేరుతో రాజకీయం చేయడం తగదు
అమరావతి – ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా శనివారం స్పందించారు.
తిరుమల దర్శనాన్ని రద్దు చేసుకోవడం ద్వారా తనకు తాను ఏనాడూ చిత్తశుద్ధి లేదని మరోసారి బయట. పట్టుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై. ద్వంద్వ ప్రమాణాలు, హిందూ మతం, దాని ఆచారాల పట్ల అజ్ఞానం తన వైఖరిని చాలా స్పష్టంగా తెలియ చేస్తోందని పేర్కొన్నారు.
జగన్ రెడ్డి కావాలని డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. ఆయనకు తిరుమలలో దర్శనం చేసుకునేందుకు సర్కార్ అడ్డు చెప్పలేదని, అయితే టీటీడీ రూల్స్ ప్రకారం అన్యమతస్తులు ఎవరైనా సరే ముందుగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ మాత్రం తెలుసుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు సత్య కుమార్.
జగన్ రెడ్డి పనిగట్టుకుని డిక్లరేషన్ చేయాలని అనుకోలేదని, అందుకే బురద చల్లడం ప్రారంభించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి.
ఇదే సమయంలో దళితులు, హిందువులు బాలాజీని సందర్శించే హక్కు ఉంది. అయితే ఈ విషయం జగన్కు తెలియదు. దళితులంతా క్రిస్టియన్లని ఆయన భావిస్తున్నారని అన్నారు. ఇది ఆయనకు ఉన్న అజ్ఞానాన్ని తెలియ చేస్తుందన్నారు సత్య కుమార్ యాదవ్.