NEWSANDHRA PRADESH

ఏపీ అభివృద్ది కోసం సూచ‌న‌లు ఇవ్వండి – సీఎం

Share it with your family & friends


పిలుపునిచ్చిన నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పురోభివృద్ది కోసం , భ‌విష్య‌త్తు బాగుండేందుకు గాను అనుభ‌వ‌జ్ఞులు, మేధావులు, ప్ర‌జ‌లు , వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌మ‌కు తోచిన రీతిలో స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.

శ‌నివారం సీఎం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీ వద్ద సూచనలు ఉన్నాయా? మీరు ఇప్పుడు వాటిని నేరుగా గో ఏపీ (GoAP)తో పంచుకోవచ్చని తెలిపారు. అంతే కాకుండా మీరు పార్టిసిపేట్ చేసినందుకు గాను త‌మ ప్ర‌భుత్వం నుంచి మీ సహకారానికి మెచ్చుకోలుగా ఇ-సర్టిఫికేట్‌ను అందుకోవచ్చని స్పష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

2047 నాటికి రూ. 2.4 ట్రిలియన్ల జీఎస్డీపీ (GSDP), రూ. 43,000 కంటే ఎక్కువ తలసరి ఆదాయంతో భారతదేశాన్ని నడిపించడమే త‌మ‌ లక్ష్యమ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం. తాము స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 వైపు ప్ర‌యాణం చేస్తున్నామ‌ని తెలిపారు .

ప్రకాశవంతమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను రూపొందించడానికి త‌మ‌ తోటి పౌరుల నుండి సూచనలను ఆహ్వానిస్తున్నామని పిలుపునిచ్చారు. ప్రతి వాయిస్ ముఖ్యమైనది, ప్రతి సూచన గణించ బడుతుందని పేర్కొన్నారు. మ‌నంద‌రం కలిసి మన రాష్ట్రాన్ని నిర్మించుకుందామ‌ని కోరారు. మీ స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను http://swarnandhra.ap.gov.in/Suggestions సైట్ ను సంద‌ర్శించి ఇవ్వాల‌ని సూచించారు.