జగన్ మాటలను జనం నమ్మరు – అనిత
మాజీ సీఎంను ఎక్కడా ఆపలేదు
మంగళగిరి – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి అన్నీ అబద్దాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. ఆయన మాటలను జనం నమ్మే స్థితిలో లేరన్నారు. శనివారం అనిత మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబును ఎయిర్ పోర్టులో ఆపినట్లు జగన్ రెడ్డిని ఎప్పుడూ ఆప లేదన్నారు. నిజంగా జగన్ రెడ్డిని ఆపాలనుకుంటే.. ఆయన సెంట్రల్ జైల్ ను విజిట్చేయగలిగే వాడా అని నిలదీశారు.
ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు వెళ్తుంటే పోలీసులపై బురద చల్లేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. జగన్ రెడ్డికి అసలు తిరుపతికి వెళ్లడానికి ఇష్టం లేదన్నారు. డిక్లరేషన్ ఇచ్చి వెళ్లడానికి అసలే ఇష్టం లేదని మరో డ్రామాతో ముందుకు వచ్చాడని ఎద్దేవా చేశారు..
బ్రహ్మోత్సవాల సమయంలో రాజకీయ నాయకులతో పాటు సుప్రీంకోర్టుల జడ్జీలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే సెక్షన్ 30 అమలు చేశారని తెలిపారు. కల్తీ నెయ్యిపై మాట్లడకుండా డైవర్సన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు అనిత.
జగన్ రెడ్డి ఏనాడైనా తిరుమల లడ్డూను టేస్ట్ చేశారా? ఆశీర్వాదం ఇచ్చిన అక్షింతలను పదిసార్లు దువ్వుకుని తీసేసిన వ్యక్తి గురించి మాట్లాడటం వేస్ట్ అన్నారు. జగన్ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అని ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు.
టీటీడీని, దేవాలయాలను భ్రష్టు పట్టించింది జగన్ రెడ్డి కాదా అని నిలదీశారు. తిరుపతి దేవస్థానం కింద డిప్యూటీ ఈవోలుగా చాలా మంది దళితులు ఉన్నారని తెలిపారు. ఇదేం దేశమని జగన్ మాట్లాడు తున్నాడంటే దేశం విడిచి పారి పోవడానికి ప్లాన్ చేస్తున్నాడేమో అనే అనుమానం కలుగుతోందన్నారు.