యువత పైనే దేశ భవిష్యత్తు – రాహుల్
ఆంట్రప్రెన్యూర్స్ గా ఎదగాలని పిలుపు
ఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కేవలం ప్రచారం మీదనే పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఎం మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఏడాదికి 2 కోట్లకు పైగా జాబ్స్ ఇస్తానని చెప్పిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎంతగా ప్రయత్నం చేసినా ప్రజలు బీజేపీని, దాని అనుబంధ పార్టీలను నమ్మే స్థితిలో లేరని చెప్పారు రాహుల్ గాంధీ. తనను కలుసుకున్న జమ్మూ కాశ్మీర్ యువతతో ఆయన సంభాషించారు. ఈ సందర్బంగా వారు చేసిన సూచనలు, సలహాలను స్వీకరించారు.
ఇదే సమయంలో తాము కొలువువల కోసం కాకుండా తామే జాబ్స్ ఇచ్చే ఆంట్రప్రెన్యూర్స్ గా ఎదగాలని , ఆ దిశగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం వస్తే యువతీ యువకులకు ప్రయారిటీ ఇస్తామని, వారిని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూస్తామని హామీ ఇచ్చారు.