వక్ఫ్ సవరణ బిల్లుపై వినతిపత్రం
జేపీసీ చైర్మన్ కు సమర్పించిన ఎంపీలు
ఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ మోడీ సంకీర్ణ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకు రావడాన్ని తప్పు పట్టారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి. ఈ మేరకు కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
శనివారం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ జేపీసీ చైర్మన్ కు వైసీపీ పార్టీ తరపున వినతిపత్రం సమర్పించారు విజయ సాయిరెడ్డి. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో ఎంపీతో పాటు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు.
మోడీ సర్కార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు ఓవైసీ. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఎలా చేపడతారంటూ ప్రశ్నించారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు అసదుద్దీన్ ఓవైసీ.
అయితే వినతిపత్రం సమర్పించిన అనంతరం విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ టీడీపీ వైఖరి ఏమిటో ఇప్పటి వరకు వెల్లడించ లేదన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వారి ఓట్లు అవసరం అవుతాయని, ఆ తర్వాత వారిని పట్టించు కోరంటూ మండిపడ్డారు ఎంపీ.