NEWSTELANGANA

ర‌చ‌యిత్రి విజ‌య భార‌తి క‌న్నుమూత

Share it with your family & friends

అంబేద్క‌ర్ ర‌చ‌న‌ల‌తో అత్యంత ప్ర‌సిద్ది

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి, తెలుగు అకాడెమీ మాజీ డైరెక్ట‌ర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సాహిత్యంలో పీహెచ్‌డీ చేసిన తొలి దళిత మహిళ డాక్ట‌ర్ బి. విజయ భారతి శ‌నివారం హైదరాబాద్‌లో కన్ను మూశారు.

డాక్టర్ బి విజయ భారతి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ మాన‌వ హక్కుల న్యాయవాది దివంగత బొజ్జా తారకం జీవిత భాగస్వామి. ఆమె రాసిన డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ జీవిత చ‌రిత్ర చాలా మంది తెలుగు వారిని ప్ర‌భావితం చేసింది. స్పూర్తిని క‌లిగించేలా చేసింది. విజ‌య భార‌తి 1983లో మ‌హాత్మా జ్యోతిబా పూలే జీవిత చ‌రిత్రను తెలుగులోకి అనువాదం చేశారు.

అంతే కాకుండా డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ర‌చ‌న‌లు, ప్ర‌సంగాల‌కు సంబంధించిన 4 సంపుటాల కాపీల‌ను అనువదించారు. దీనిని తెలుగు విశ్వ విద్యాల‌యం ప్ర‌చురించింది. రామాయ‌ణం, మ‌హా భారతంపై విమ‌ర్శ‌నాత్మ‌క పుస్త‌కాల‌ను ర‌చించారు బి. విజ‌య భార‌తి. వీటిని హైద‌రాబాద్ బుక్ ట్ర‌స్ట్ ప్ర‌చురించింది.

ప‌ద్మ‌శ్రీ బోయి భీమ‌న్న కూతురే విజ‌య భార‌తి. ఆమె మృతి ప‌ట్ల సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు , ఎమ్మెల్సీ, తెలంగాణ జ‌న స‌మితి చీఫ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సంతాపం తెలిపారు.