NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబు రాజ‌కీయం జ‌గ‌న్ ఆగ్ర‌హం

Share it with your family & friends

మంత్రులు..సీఎంల లేఖ‌ల‌తో స‌భ్యుల నియామ‌కం

అమ‌రావ‌తి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వివాదంపై ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కావాల‌ని రాద్దాంతం చేస్తున్నారంటూ ఆరోపించారు.

లడ్డూల తయారీ కోసం నెయ్యి కొనుగోలు కార్యక్రమం దశాబ్దాలుగా జరుగుతోందన్నారు. 6 నెలలకి ఒకసారి టెండర్‌ పిలుస్తారని చెప్పారు. ఎల్‌–1 గా వచ్చిన వారికి టెండర్‌ ఖరారు చేస్తారని వెల్ల‌డించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించాలని కేంద్ర మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా ప్రముఖులను రికమెండ్‌ చేస్తారని కుండ బ‌ద్ద‌లు కొట్టారు మాజీ ముఖ్య‌మంత్రి. స్వామి వారికి సేవ‌లు అందించాల‌ని కోరుకుంటార‌ని, ఇది స‌ర్వ సాధార‌ణ‌మ‌ని పేర్కొన్నారు వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి.

బోర్డులోని సభ్యులు దేవుడికి ఇంకా సేవ చేయాలని, భక్తులకు మంచి చేయాలని నిర్ణయాలు తీసుకుంటారే త‌ప్పా వ్య‌తిరేకంగా తీసుకోర‌ని స్ప‌ష్టం చేశారు.