ఈడీ బీజేపీకి కలెక్షన్ ఏజెంట్ – సంజయ్ రౌత్
ప్రధాని మోడీ..నిర్మలా సీతారామన్ పై ఫైర్
మహారాష్ట్ర – శివసేన (యుబిటీ) పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లపై నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారతీయ జనతా పార్టీకి కలెక్షన్ ఏజెంట్ గా మారి పోయిందని సంజయ్ రౌత్ ఆరోపించారు. బీజేపీ ఖాతాల్లోకి వెళ్లిన డబ్బులు ఈడీ ద్వారా చేరుతోందన్నారు. ఈడీ అవినీతి సంస్థగా మారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మలా సీతారామన్ అక్రమంగా డబ్బులు కూడ బెట్టినందుకే ఆమెపై అభియోగాలు నమోదయ్యాయని అన్నారు సంజయ్ రౌత్. ఈ డబ్బు వసూలు చేయడంలో ఆమెకు ఈడీ, సీబీఐలు సహాయ పడ్డాయని ఆరోపించారు.
ఈ దేశంలో అత్యంత అవినీతి సంస్థలుగా మారి పోయిన వాటికి పూర్తి బాధ్యత వహించాల్సింది ఎవరో కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అని స్పష్టం చేశారు శివసేన యుబిటీ నేత.
ఇదిలా ఉండగా ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ కు సంబంధించిన ఫిర్యాదులపై ఆర్థిక మంత్రిపై కేసు నమోదైంది. దీనిపై స్పందించారు సంజయ్ రౌత్.