NEWSNATIONAL

ప్ర‌జా నాయ‌కుడా అల్విదా – ఉద‌య‌నిధి

Share it with your family & friends

ఉప ముఖ్య‌మంత్రిగా సీఎం అవ‌కాశం

త‌మిళ‌నాడు – రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఉద‌య‌నిధి స్టాలిన్ కు అరుదైన అవ‌కాశం ద‌క్కింది. డీఎంకే పార్టీ చీఫ్ , ప్ర‌స్తుత రాష్ట్ర ముఖ్య‌మంత్రి , త‌న తండ్రి ఎంకే స్టాలిన్ త‌న‌యుడికి బిగ్ గిఫ్ట్ ఇచ్చారు.

ఉద‌య‌నిధి స్టాలిన్ కు ప‌దోన్న‌తి క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు . ఈ మేర‌కు ఉప ముఖ్య‌మంత్రిగా నియ‌మిస్తున్న‌ట్లు తెలిపారు ఎంకే స్టాలిన్. ఈ సంద‌ర్బంగా ఇవాళ ఉద‌య‌నిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా కొలువు తీర‌నున్నారు.

ఈ సంద‌ర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే పార్టీ ఆధ్వ‌ర్యంలో నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద ఎత్తున సంబురాల‌లో మునిగి పోయారు. ఈ సంద‌ర్బంగా దివంగ‌త ప్ర‌జా నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి స‌మాధి వ‌ద్ద పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు.

క‌రుణానిధి త‌న‌కు తాత కావ‌డం త‌న అదృష్ట‌మ‌ని పేర్కొన్నారు. ఆయ‌న చూపిన బాట‌లోనే తాను న‌డుస్తాన‌ని, ప్ర‌జ‌ల ఆశ‌ల‌కు అనుగుణంగా పాల‌నా ప‌రంగా విశిష్ట‌మైన సేవ‌లు అంద‌జేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు ఉద‌య‌నిధి స్టాలిన్.

త‌న‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని క‌ట్ట బెట్టినందుకు డీఎంకే పార్టీ చీఫ్ , సీఎం ఎంకే స్టాలిన్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు .