యువతపైనే దేశ ఆర్థిక భవిష్యత్తు – ముంతాజ్
ఆంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు కృషి చేయాలి
ఢిల్లీ – యువతీ యువకుల పైనే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు ముంతాజ్ పటేల్. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో రాజనీతి పాఠశాల వ్యవస్థాపకుడు అజయ్ పాండే ఆధ్వర్యంలో యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ కాన్ క్లేవ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు .
ఈ సందర్బంగా ప్రసంగింస్తూ ముంతాజ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాపార పరంగా రాణించడం మామూలు విషయం కాదన్నారు. ఇందులో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని పేర్కొన్నారు.
ప్రధానంగా భారతదేశ అభివృద్ధిలో యువ పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు ముంతాజ్ పటేల్. ఈ కార్యక్రమం సందర్బంగా చర్చించడం ఆనందంగా ఉందన్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన యువ పారిశ్రామికవేత్తలతో చర్చించడం ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మిగిలి పోతుందన్నారు ముంతాజ్ పటేల్. ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత, భారతదేశం యువ దేశమని, యువత మాత్రమే దానిని ఆర్థికంగా అగ్ర రాజ్యంగా మార్చగలదనే నా నమ్మకం మరింత బలపడిందన్నారు.