NEWSTELANGANA

తెలంగాణ‌లో తుగ్ల‌క్ పాల‌న‌ – హ‌రీశ్ రావు

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డ మాజీ మంత్రి

హైద‌రాబాద్ – మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. రాష్ట్రంలో తుగ్ల‌క్ పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. లంగర్‌హౌజ్ హసీంనగర్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను ఆదివారం ప‌రామ‌ర్శించారు మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి.

అనంత‌రం మీడియాతో మాట్లాడారు హ‌రీశ్ రావు. రేవంత్ రెడ్డి ఈరోజు పేదల విషయంలో అనవసర ప్రయత్నం చేస్తున్నాడ‌ని, ఇళ్లన్నీ కూలగొట్టి ప్రపంచ బ్యాంకుకు మన భూములను తాక‌ట్టు పెట్టాల‌ని చూస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

మూసీ నది సుందరీకరణ పేరు మీద రిసార్టులు, హోటళ్ళు కట్టి ఏదో ఉద్దరిస్తాడంట అంటూ ఎద్దేవా చేశారు హ‌రీశ్ రావు. పేద వాళ్ల రక్తం మీద, కన్నీళ్ళ మీద మూసీ సుందరీకరణ చేస్తావా అంటూ నిల‌దీశారు.

రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినా వాటిని వదిలేసి మూసి నది మీద పడి పేదల ఉసురు తీస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌కుండా.. ఎన్నికల్లో ఇవ్వని హామీ కోసం ఎందుకు కూల్చుతున్నారంటూ ప్ర‌శ్నించారు హ‌రీశ్ రావు.

ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క హామీ నెరవేర్చ లేద‌ని , మహిళలకు ఇచ్చేందుకు రూ. 2,500 లేవు కానీ పేదల బతుకులను కూల్చేందుకు రూ. 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయ‌ని ప్ర‌శ్నించారు సీఎంను. మేనిఫెస్టోలో మూసీ సుంద‌రీక‌ర‌ణ చేస్తామ‌ని చెప్ప‌లేద‌న్నారు.

ఎవరి కోసం మూసీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నావో చెప్పాల‌ని, ఇందులో ఎవ‌రి వాటా ఎంత ఉందో తేల్చాల‌ని డిమాండ్ చేశారు హ‌రీశ్ రావు. కేసీఆర్ నిర్మించే కార్యక్రమం చేప‌డితే రేవంత్ రెడ్డి కూల్చ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడ‌ని ఆవేద‌న చెందారు.