మహిళలు శక్తి అభియాన్ లో చేరండి – రాహుల్
మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపు
ఢిల్లీ – లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు మహిళలపై. ఆదివారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా తాము ఏర్పాటు చేసిన శక్తి అభియాన్ కు అద్బుతమైన ఆదరణ లభిస్తోందని చెప్పారు.
ఒక సంవత్సరం క్రితం తాము రాజకీయాల్లో మహిళల గొంతులను విస్తరించే లక్ష్యంతో ‘ఇందిరా ఫెలోషిప్’ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇవాళ ఈ చొరవ మహిళా నాయకత్వానికి శక్తివంతమైన ఉద్యమంగా ఎదిగిందన్నారు.
నిజమైన సమానత్వం, న్యాయం కోసం రాజకీయాల్లో ఎక్కువ మంది మహిళలు రావాల్సిన అవసరం ఉందన్నారు. “ఆధి అబాది, పూరా హక్” ఈ కారణం పట్ల మనకున్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు రాహుల్ గాంధీ.
నిజమైన మార్పును సృష్టించాలని మక్కువ ఉన్న మహిళలందరూ ‘శక్తి అభియాన్’లో చేరాలని, మహిళా కేంద్రీకృత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బలమైన అట్టడుగు సంస్థలను నిర్మించడానికి, అర్థవంతమైన మార్పును తీసుకు రావడానికి సహకరిస్తారని పేర్కొన్నారు . మాతో చేరండి ఈరోజే http://shaktiabhiyan.inలో నమోదు చేసుకోండి అని కోరారు రాహుల్ గాంధీ.
X: https://x.com/Indirafellows
FB: https://facebook.com/indira.fellowship
Instagram: https://instagram.com/indira.fellowship/