హర్యానా కొడుకుని ఏమీ చేయలేరు
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫైర్
హర్యానా – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హర్యానా రాష్ట్రంలోని బాద్షాపూర్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.
భారతీయ జనతా పార్టీ నేతలు తనను కావాలని పదే పదే ఇబ్బందులు పెడుతూ వచ్చారని ఆరోపించారు. 5 నెలలకు పైగా జైలులో పెట్టారని, కానీ ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా బయట పెట్టలేక పోయారని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్.
నిరాధారమైన ఆరోపణలు చేశారు. చివరకు కోర్టులో చేతులు ఎత్తేశారంటూ ఆరోపించారు. తీహార్ జైలులో తనను చాలా రకాలుగా వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్. చివరకు నన్ను అంతం చేయాలని అనుకున్నారని, మందులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు.
కానీ దేవుడి ఆశీస్సులు, మీ అందరి ప్రార్థనలతో తాను బయటకు వచ్చానని చెప్పారు. ఎన్ని కుట్రలు పన్నినా వర్కవుట్ కాలేదన్నారు. నన్ను విచ్ఛిన్నం చేయాలని అనుకున్నారని, కానీ తాను హర్యానా కొడుకునని, నన్ను ఓడించ లేరంటూ స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్.