హైడ్రా దూకుడు ఆపితే మంచిది – బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర సర్కార్ కు స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్ – హైడ్రా కూల్చి వేతలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నడిపించే పద్దతి ఇది కాదన్నారు.
ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్ల కూల్చివేతకు ముందు బీజేపీ కార్యకర్తలపై బుల్డోజర్ వెళ్లాలని అన్నారు. పేదలను , సామాన్యులను వేధించడం ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్ పటేల్.
అది హైడ్రా అయినా, మూసీ అయినా, బీజేపీ అంతా సన్నద్ధమైందన్నారు. ఈ అన్యాయ కూల్చివేతలను వ్యతిరేకిస్తూ పేదలకు మద్దతుగా బుల్డోజర్ల ముందు నిలుస్తుందని ప్రకటించారు కేంద్ర మంత్రి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉందని, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని, ప్రభుత్వాన్ని నడపాల్సిన విధానం ఇది కాదన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాలపై పునరాలోచించి తక్షణం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ కుమార్.