తిరుమలను సందర్శించిన సీజేఐ
వేదాశ్వీరచనం అందించిన పూజారులు
తిరుమల – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ తన సతీమణితో కలిసి ఆదివారం తిరుమలను సందర్శించారు. ఈ సందర్బంగా సీజేఐకి సాదర స్వాగతం పలికారు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్య నిర్వహణ అధికారి జె. శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీర బ్రహ్మం, జేఈవో గౌతమి, ఇతర ఉన్నతాధికారులు.
ఆయనకు సాదర స్వాగతం పలికారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ రాక సందర్బంగా భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి ఆలయానికి వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద సీజేఐకి స్వాగతం పలికారు. అనంతరం దర్శనం చేయించారు. ప్రార్థనలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో , ఏఈవో శ్రీవారి చిత్ర పటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.