NEWSTELANGANA

చెరువులు క‌నుమరుగైతే ప్ర‌మాదం – భ‌ట్టి

Share it with your family & friends

డిప్యూటీ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు

అమెరికా – మాన‌వ నాగ‌రిక‌త నిర్మాణంలో, అభివృద్దిలో చెరువులు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని అన్నారు తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా ఆదివారం శాన్ ఫ్రాన్సిస్కో లో సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది

హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ ఇళ్ల నిర్మాణం పేరిట రాళ్లు కనుమరుగై పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లేక్స్ కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారని వాపోయారు. పార్కులు లేకుండా పోయాయ‌ని పేర్కొన్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

చెరువులు ( లేక్స్) లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఇటీవల విజయవాడ నగరం వరదలో చిక్కుకు పోయిన పరిస్థితులు హైదరాబాదు లోనూ ఏర్పడతాయ‌ని హెచ్చ‌రించారు.

నది గర్భంలో ఇల్ల నిర్మాణాలు చేస్తున్నారని, వీటిని ఇప్పటికీ ఆపక పోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. హైదరాబాద్ కి ప్రాణాంతకంగా మారుతుంద‌ని, పేదవాళ్లను అడ్డంపెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

ప్రభుత్వ ఆస్తులు కాపాడడం ప్రభుత్వం బాధ్యత అని స్ప‌ష్టం చేశారు. చెరువులను రక్షించి భవిష్యత్తు తరాలను అందించేందుకు తెలంగాణ రాష్ట్రంలో చర్యలు చేపట్టామ‌ని ప్ర‌క‌టించారు.