ENTERTAINMENT

ఎఫ్ సీసీ అధ్య‌క్షుడిగా కేఎస్ రామారావు

Share it with your family & friends

జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా తుమ్మ‌ల రంగారావు

హైద‌రాబాద్ – తెలుగు సినిమా రంగానికి సంబంధించి కీల‌క‌మైన సంస్థ‌గా పేరు పొందింది ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్. గ‌త కొన్నేళ్లుగా వివిధ కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతూ వ‌చ్చింది. తాజాగా సీఎం ఎ. రేవంత్ రెడ్డిని క‌లిసింది ఈ సంస్థ బృందం. భారీ విరాళాన్ని అంద‌జేసింది.

తాజాగా ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ కు సంబంధించి ప్ర‌తిష్టాత్మ‌కంగా ఎన్నిక‌లు జ‌రిగాయి. సంస్థ అధ్య‌క్షుడిగా కేఎస్ రామారావు ఎన్నిక‌య్యారు. ఆయ‌న భారీ మెజారిటీతో గెలుపొందారు. ఉపాధ్య‌క్షుడిగా ఎస్ఎన్ రెడ్డి విజ‌యం సాధించ‌గా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా తుమ్మ‌ల రంగారావు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

సంయుక్త కార్య‌ద‌ర్శిగా స‌దా శివ రెడ్డి ఎన్నికయ్యారు. కోశాధికారిగా జె. శైలజ ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఎన్నిక‌ల అనంత‌రం గెలుపొందిన అధ్య‌క్షుడు కేఎస్ రామారావు మీడియాతో మాట్లాడారు. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి గెలిపించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

గ‌తంలో మాదిరిగానే ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ముందుకు వెళుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తామ‌ని, సంస్థ‌కు మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు కేఎస్ రామారావు.