త్వరలోనే వక్ఫ్ బిల్లు – అమిత్ షా
సంచలన కామెంట్స్ చేసిన మంత్రి
ఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి వక్ఫ్ బిల్లు సవరణ బిల్లుపై స్పందించారు. ఆరు నూరైనా, ఎవరు అడ్డుకున్నా బిల్లును ఆపే ప్రసక్తి లేదన్నారు. తాము ఒక్కసారి కమిట్ అయ్యామంటే చేసి తీరుతామని ప్రకటించారు.
మరో వైపు ప్రతిపక్షాలు వక్ఫ్ బిల్లు సవరణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని తప్పు పట్టారు. ప్రతిపక్షాలకు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, బీజేపీని, మోదీని, తనను విమర్శించడం తప్ప చేసేది ఏమీ ఉండదంటూ ఎద్దేవా చేశారు. ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే చర్చించాలే తప్పా అడ్డుకుంటామంటే ఎలా అని ప్రశ్నించారు అమిత్ చంద్ర షా.
అయినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభిస్తుందని అమిత్ చంద్ర షా ధీమా వ్యక్తం చేశారు.
ఇందులో సమస్యలు ఉన్నవారు ఈ చట్టం ఆమోదించిన తర్వాత సరిదిద్ద బడతారు అంటూ ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల నుంచి తమకు మద్దతు లభిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు సవరణ బిల్లు తప్పక ఆమోదం పొందుతున్న నమ్మకాన్ని వ్యక్తం చేయడం విశేషం.