అదానీ సహాయం ప్రజ్ఞానంద సంతోషం
గత కొంత కాలంగా మద్దతు ఇచ్చారు
తమిళనాడు – ప్రముఖ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కీలక వ్యాఖ్యలు చేశారు . తను మీడియాతో మాట్లాడుతూ అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్, భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ప్రశంసలు కురిపించారు. తాను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అదానీ గ్రూప్ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందజేసిందని తెలిపారు. ఈ సందర్బంగా సంస్థకు, చైర్మన్ గౌతమ్ అదానీకి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు ఆర్. ప్రజ్ఞానంద.
ఈ సహాయం ఇప్పటి నుంచి కాదుగత ఏడాది నుండి అదానీ గ్రూప్ తనకు మద్దతు ఇస్తోంది, వారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని స్పష్టం చేశారు చెస్ గ్రాండ్ మాస్టర్. అయితే ఈ ఏడాది ప్రారంభంలో గౌతమ్ అదానీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నానని చెప్పాడు. చాలా సంతోషం కలిగించిందని అన్నాడు.
తన ముందున్న లక్ష్యం ఒక్కటేనని, భారత దేశానికి చెస్ పోటీల పరంగా బంగారు పతకాన్ని సాధించాలని , దానిని సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు ఆర్. ప్రజ్ఞానంద. అంతకు ముందు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీని కలుసుకున్నానని, ఈ సందర్బంగా తనను ప్రత్యేకంగా అభినందించడం, వెన్నుతట్టి ప్రోత్సహించడం మరిచి పోలేనని పేర్కొన్నాడు.