NEWSNATIONAL

ఇక అన్నీ ఉద‌య‌నిధికే – స్టాలిన్

Share it with your family & friends

ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండేందుకే ప‌ద‌వి

త‌మిళ‌నాడు – రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యువ‌జ‌న సంక్షేమం, క్రీడాభివృద్ది శాఖ మంత్రిగా త‌న త‌న‌యుడు , యువ నేత ఉద‌య‌నిధి స్టాలిన్ కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు.

వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు తెర లేపారంటూ త‌న‌పై, డీఎంకే పార్టీపై వ‌స్తున్న ప్ర‌చారంపై స్పందించారు స్టాలిన్. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. గ‌త కొంత కాలంగా పార్టీ బలోపేతం కోసం , భావ సారూప్య‌త క‌లిగిన వారిని ఒకే వేదిక‌పైకి తీసుకు రావ‌డంలో ఉద‌య‌నిధి స్టాలిన్ కీల‌క పాత్ర పోషించాడ‌ని కొనియాడారు.

ప్ర‌స్తుతం పార్టీలో అత్య‌ధిక శాతం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు త‌మ‌కు యువ నాయ‌కుడి సార‌థ్యం కావాల‌ని కోరుతున్నార‌ని, అందుకే ఉద‌య‌నిధికి డిప్యూటీ సీఎం కీల‌క ప‌ద‌విని అప్ప‌గించ‌డం జ‌రిగింద‌న్నారు. త‌న త‌న‌యుడిని త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉండేందుకు ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మరింత మెరుగైన సేవ‌లు అందించేందుకు ఇచ్చాన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎంకే స్టాలిన్. త‌ను అన్ని ర‌కాలుగా, అన్ని విధాలుగా ఆ ప‌ద‌వికి అర్హుడ‌ని, అందుకే ఛాన్స్ ఇచ్చామ‌న్నారు ముఖ్య‌మంత్రి.