శ్రీవారిని దర్శించుకున్న జే షా
ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా
తిరుమల – ఐసీసీ చైర్మన్, బీసీసీఐ కార్యదర్శి జే షా తిరుమలను సందర్శించారు. ఆదివారం ఈ శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన పూజలు చేశారు. ఇటీవలే ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు ఎన్నికలు జరిగాయి. జే షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యంత పిన్న వయస్సు కలిగిన వ్యక్తి చైర్మన్ కావడం విశేషం.
బీసీసీఐ కార్యదర్శిగా ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా తీర్చి దిద్దడంలో కీలకమైన పాత్ర పోషించారు జే షా. ఆయన ఎవరో కాదు ప్రస్తుతం బీజేపీలో నెంబర్ 2 గా , ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తనయుడే జే షా.
ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానానికి జై షా సంప్రదాయ దుస్తులు ధరించి పూజలు నిర్వహించారు. దర్శనం సందర్భంగా ఆయన కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్షేత్రం విష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది.
అంతకు ముందు బెంగళూరులో ప్రారంభించిన కొత్త జాతీయ క్రికెట్ అకాడమీపై షా మాట్లాడారు. దీనికి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని పేరు పెట్టడం జరిగిందన్నారు. త్వరలోనే మరిన్ని కీలకమైన మార్పులు తీసుకు వస్తామని తెలిపారు.