సీఎం సిద్దరామయ్యపై ఈడీ కేసు
ముడా కేసులో సీఎంతో పాటు కుటుంబం
కర్ణాటక – కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ముడా కేసులో మనీ లాండరింగ్ కింద కేసు నమోదుచేసింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. దీంతో కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కలకలం రేపుతోంది ఈ వ్యవహారం. ఇప్పటికే ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీని, ప్రధాన మంత్రి మోడీని, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షాలను టార్గెట్ చేశారు.
ముడా కుంభకోణంతో ముడిపడి ఉన్నందున సిద్దరామయ్యపై కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా కర్ణాటక లోకాయుక్త దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో సిద్దరామయ్య దంపతుల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో సిద్దరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావ మరిది మల్లికార్జున స్వామి లు దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం సిద్దరామయ్య పై మనీ లాండరింగ్ నిరోధక చట్లం కింద కేసు నమోదు చేసినట్లు ప్రకటించింది ఈడీ. అయితే నిందితులుగా ఎవరినైతే పేర్కొన్నారో వారిని విచారణ నిమిత్తం పిలిచేందుకు, వారి ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీకి అధికారం ఉంటుంది. సీఎం ఏం నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.