బాధితుల కోసం సుప్రీంకోర్టుకు వెళతాం – కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని
కిషన్ బాగ్ లో సోమవారం మూసీ బాధితులతో మాట్లాడారు. మీరు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు రేవంత్ రెడ్డి నుంచి ఎలా కాపాడు కోవాలన్న ఆందోళన మీలో ఉందన్నారు.
పుట్టేది… చనిపోయేది ఒక్కసారే. ధైర్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డికి తలొగ్గేది లేదని అన్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లి అయినా సరే, తాము మీకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు కేటీఆర్.
మీలో ఉన్న ఐక్యతను దెబ్బతీసే కుట్ర చేస్తారని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలంటూ మీ ఓట్లు వేయించుకున్నారని కానీ ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు కేటీఆర్.
మహిళలకు రూ. 2500, అవ్వ, తాతలకు రూ. 4 వేలు వంద రోజుల్లో ఇస్తామన్నారని, మీలో ఎవరికైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. మూసీ నదిని ప్రక్షాళన చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందని, సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ బడా నేతలు పొగడటం దారుణమన్నారు.
ఈ అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ ఏంటీ? రాహుల్ బాబా ఏమో “బుల్డోజర్ రాజ్ నయి ఛలేగా” అంటాడు. మరి తెలంగాణలో పేదల ఇళ్లపైకి రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపిస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నాడని ప్రశ్నించారు.