NEWSANDHRA PRADESH

బాబూ పదవి ఉందని..పెదవి జారితే ఎలా..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

తిరుప‌తి – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడిని ఏకి పారేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఇవాళ తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వివాదానికి సంబంధించిన కేసు విచారించింది. జ‌స్టిస్ గ‌వాయ్, జ‌స్టిస్ విశ్వ‌నాథ‌న్ తో కూడిన ధ‌ర్మాసనం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఒక ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి ముంద‌స్తు విచార‌ణ‌కు ఆదేశించ‌కుండా ఎలా మీడియా ముందుకు వ‌చ్చి చెబుతారంటూ నిల‌దీసింది.

దేవుళ్ల‌ను ద‌యచేసి రాజ‌కీయాల్లోకి లాగ‌కండి అంటూ చుర‌క‌లు అంటించింది. ఈ సంద‌ర్బంగా తీవ్రంగా స్పందించారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. స‌త్యం ఎప్ప‌టికైనా గెలుస్తుంద‌ని ఈ వ్యాఖ్య‌ల‌తో తేలి పోయింద‌న్నారు. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం త‌మ‌ను బ‌ద్నాం చేశార‌న్న నిజం బ‌య‌ట ప‌డింద‌న్నారు. ఇక‌నైనా ఏపీ ప్ర‌జ‌లు, కోట్లాది మంది భ‌క్తులు మేలు కోవాల‌ని, దేవుడి పేరుతో, శ్రీ‌వారి ల‌డ్డూ క‌ల్తీ అయ్యింద‌న్న దుష్ప్ర‌చారాన్ని న‌మ్మ వ‌ద్ద‌ని కోరారు భూమున క‌రుణాక‌ర్ రెడ్డి.