బాబు విడిచిన బాణం షర్మిల
ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్
అమరావతి – వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలా రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తను స్థాయిని మరిచి మాట్లాడుతోందని ఆరోపించారు.
ఆమె పరిణతి చెందిన నాయకురాలిగా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు. షర్మిలను చూస్తే తమకు జాలి కలుగుతోందన్నారు. రాజకీయాలు అన్నాక ఓ పద్దతి ప్రకారం మాట్లాడాలని, దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో అభివృద్ది జరిగిందన్నది తెలుసు కోలేక పోవడం దారుణమన్నారు.
ఇవాళ విద్యా, వైద్య రంగాలలో ఇండియాలోనే ఏపీ నెంబర్ వన్ గా ఉందన్నారు. దీనికి కారణం యువ నాయకుడైన జగన్ మోహన్ రెడ్డి ఉండడం వల్లనే సాధ్యమైందన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆమె ఫక్తు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. అయితే చంద్రబాబు డైరెక్షన్ లోనే షర్మిల నడుస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.