DEVOTIONAL

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలపై ప్ర‌త్యేక క‌మిటీ

Share it with your family & friends

ఏర్పాటు చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమ‌ల – తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అక్టోబరు 8న గరుడ సేవను తిలకించడానికి విచ్చేసే అసంఖ్యాక యాత్రికులను వాహనానంతరం సురక్షితంగా తరలించేందులో భాగంగా టిటిడి ఎవాక్యులేషన్ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇదే విషయాన్ని తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన బ్రహ్మోత్సవ ఏర్పాట్ల సమీక్షలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడారు. అక్టోబరు 8న గరుడ సేవ దర్శనం పూర్తయిన తర్వాత నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలలోని భక్తులను సురక్షితంగా వారి సమీప బస్టాండ్ ప్రదేశాలను చేరుకునేందుకు వీలుగా టిటిడి విజిలెన్స్ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

వీరంతా ట్రాఫిక్ పోలీసుల‌ తో సమన్వయం చేసుకుంటూ భక్తులను సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు చేరే ఏర్పాట్లు చేస్తారన్నారు. భక్తులకు తాము ఉన్న గ్యాలరీలకు దగ్గరగా ఉన్న బస్టాండు ప్రదేశాలు చేరేందుకు వీలుగా డిస్ ప్లే ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు.

అనంతరం ఏఈవో సాంస్కృతిక కళా బృందాల కార్యక్రమాలు గురించి చర్చించడంతో పాటు వాహన ఊరేగింపు సమయంలో గోశాల అధికారుల ఆధ్వర్యంలో నడిచే రధ, గజ, తురగ ఏర్పాట్లను, తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు వెంక‌య్య చౌద‌రి.

ఈ సమావేశంలో, సీఈ స‌త్య‌నారాయ‌ణ‌, జీఎం ట్రాన్స్‌పోర్ట్ శేషారెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీఓలు సురేంద్ర, రామ్‌కుమార్, గోశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి, ఆల్ హిందూ ధర్మ ప్రాజెక్ట్స్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.