NEWSANDHRA PRADESH

సామాజిక భ‌ద్ర‌త ప్ర‌భుత్వ బాధ్య‌త – దుర్గేష్

Share it with your family & friends

ఏపీ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కామెంట్

అమ‌రావ‌తి – రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మం కొన‌సాగింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన విజ్జేశ్వరంకి చెందిన చడల్లా సత్యనారాయణకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోటాలో రూ.15,000 పెన్షన్ అందించారు. పూర్తి భ‌రోసా క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

బాధిత లబ్ధిదారునికి మనో ధైర్యం కల్పించారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కాంక్షించారు. అనారోగ్యంతో సతమతం అమవుతున్న తమలాంటి వారిని ఆదుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు బాధితుడు సత్యనారాయణ.

సామాజిక భద్రత పెన్షన్లతో అన్ని వర్గాల వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా విజ్వేశ్వరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడారు. సామాజిక భ‌ద్ర‌త ప్ర‌భుత్వ బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా దీర్ఘ‌కాలిక‌ జబ్బులతో బాధ పడుతున్న, మంచానికే పరిమితమైన బాధితుల‌కు కూటమి సర్కారు కొండంత అండగా నిలిచింద‌న్నారు.