బ్రహ్మానందం నెట్టింట్లో హల్ చల్
ఐఫా అవార్డస్ 2024లో ఐష్ తో నటుడు
హైదరాబాద్ – విలక్షణ హాస్య నటుడు , వక్త కన్నెగంటి బ్రహ్మానంద చారి అలియాస్ బ్రహ్మానందం వైరల్ గా మరారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నారు. తాజాగా అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డ్స్ 2024లో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తో పాటు కూతురు ఆరాధ్య బచ్చన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఇద్దరూ కలిసి హాస్య బ్రహ్మ బ్రహ్మానందంతో ఓ సెల్ఫీ తీసుకున్నారు.
దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు నటుడు బ్రహ్మానందం. భారతీయ సినీ చరిత్రలో అద్భుతమైన నటిగా ఐశ్యర్యా రాయ్ బచ్చన్ కు పేరుందన్నారు. ఇవాళ తనతో పాటు కూతురు కూడా తనతో సెల్ఫీ తీసుకోవడం మరింత ముచ్చటేసిందని, అదే సమయంలో అంతకు మించిన ఆనందం కలిగిందన్నారు నటుడు బ్రహ్మానందం.