ధర్మం కోసం జనసేనాని పోరాటం
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఎలా
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధర్మ పోరాటానికి శ్రీకారం చుట్టారని, ఇది ఇంతటితో ఆగదని నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది జనసేన పార్టీ. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈ సందర్బంగా ప్రతి ఒక్క హిందు బంధువు పవన్ కళ్యాణ్ చేస్తున్న ధర్మ పోరాటానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వైసీపీ ఫేక్ ప్రచారానికి తెర తీసిందని ఆరోపించింది. చిల్లర మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
సుప్రీం కోర్టు దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పింది తప్పించి తిరుమల లడ్డూ మహా ప్రసాదం విచారణ ఆపమని కానీ, కల్తీ జరగలేదు అని కానీ చెప్పలేదని తెలిపింది. జనసేన పార్టీ ఏనాడు దేవుడిని రాజకీయాల కోసం వాడుకోలేదు, వాడుకోదని స్పస్టం చేసింది. ఇలా చేయాలి అనుకుంటే రామ తీర్థం ఘటన రోజున చేసి ఉండేవారని. ఒక ధర్మంపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నారని తెలిపింది.
తిరుమల లడ్డు కల్తీ విషయంలో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు SIT ద్వారా ప్రభుత్వం విచారణ చేసేలాగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కింది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి జరుగుతున్న దాడులను శాశ్వతంగా అరికట్టేందుకు, ధర్మాన్ని పరిరక్షించేందుకు నడుం బిగించి పోరాటం చేస్తున్నారని వెల్లడించింది. రెండు విధాలుగా తిరుమల లడ్డు అంశంపై పని చేస్తున్నారని తెలిపింది.
సిబిఐ కి విచారణ జరిపించేందుకు ఇవ్వాలని అడిగే వైసీపీకి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నామని , బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో ఎందుకు ఆ విషయం అడగలేదని నిలదీసింది జనసేన పార్టీ. సెక్యులరిజం అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా టూ వే, వన్ వే కాదని స్పష్టం చేసింది.