NEWSTELANGANA

మీ తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డ‌ను – కేటీఆర్

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డిపై సీరియ‌స్ కామెంట్స్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంత నిర్వాసితుల‌ను మంగ‌ళ‌వారం ప‌రామ‌ర్శించారు. అంత‌కు ముందు ముషీరాబాద్ వ‌ద్ద కాంగ్రెస్ మూక‌లు దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం చేశాయి. కానీ ఎక్క‌డా తగ్దే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు కేటీఆర్.

హైకోర్టు తిట్టినప్పటికీ సిగ్గు, లజ్జ లేకుండా పేదల ఇండ్లను తుగ్ల‌క్ స‌ర్కార్ కూల్చి వేస్తోందంటూ మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. .పేదవాళ్ల కోసం తాము లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు క‌ట్టామ‌మ‌ని, ద‌మ్ముంటే నువ్వు ఆ రెండు ల‌క్ష‌లు క‌ట్టించి చూపించాల‌ని స‌వాల్ విసిరారు.

లీగ‌ల్ నోటీసుల‌కు , దాడుల‌కు భ‌య‌ప‌డే ర‌కం కాద‌న్నారు. మీ తాటాకు చప్పుళ్ళకి భయపడేవాడిని కాదు రేవంత్‌ రెడ్డి….మీ తాట తియ్యడానికి వచ్చానని హెచ్చ‌రించారు కేటీఆర్. నీ పిల్లి కూతలకి భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ! ఉద్యమాల పిడికిలి ఇది గుర్తు పెట్టుకో అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఘాటుగా ప్ర‌శ్నించారు. అదానీతో ఢిల్లీలో నీది కుస్తీ .. దావోస్‌లో రేవంత్ దోస్తీ, ఎవ‌రు రైట్ ఇంకెవ‌రు రాంగ్ అనేది చెప్పాల‌న్నారు. బుల్డోజ‌ర్ రాజ్ యూపీలో త‌ప్పు మ‌రి హైద‌రాబాద్ లో ఎట్లా ఒప్పు అవుతుంద‌ని నిల‌దీశారు కేటీఆర్.