రూ. 10 లక్షల కోట్ల అప్పు..లక్ష కోట్ల వడ్డీ – సీఎం
ఇదీ జగన్ రెడ్డి సర్కార్ చేసిన నిర్వాకం
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన గత వైసీపీ జగన్ రెడ్డి సర్కార్ చేసిన నిర్వాకంపై మండిపడ్డారు. మంగళవారం ఆయన టీడీపీ కీలక సమావేశంలో మాట్లాడారు.
ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లాడని, వీటికి సంబంధించి లక్ష కోట్ల వడ్డీ కట్టాల్సి ఉంటుందన్నారు నారా చంద్రబాబు నాయుడు. దీనికి తోడు అందినంత మేరకు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. తనతో పాటు తన పరివారానికి అందినంత మేరకు దోచుకునేలా ఛాన్స్ ఇచ్చాడని ధ్వజమెత్తారు.
నాటి పాలకులు చేసిన పాపాలు ఇవాళ శాపాలుగా మారాయని ఆవేదన చెందారు. అయినా సరే కష్టపడతా.. ఇవన్నీ తాత్కాలికం, రాష్ట్రం గాడిలో పడే వరకు కష్టపడి, మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అన్నదాత నడ్డి విరిచి, ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన సంగతి మర్చిపోయావా సైకో ? నీ సైకో పేపర్ లో సొల్లు రాయటం తప్ప, ఏ నాడైనా రైతన్నని ఆదుకున్న మొఖమేనా నీది ? అంటూ మండిపడ్డారు ఏపీ సీఎం.
100 రోజుల్లో తమ ప్రభుత్వం ఏమి చేసిందో తెలుసుకోవాలి అంటే, నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కదా. బెంగళూరులో పార్టీలు చేసుకుంటూ, పార్ట్ టైం రాజకీయం చేసే పొలిటికల్ సైకోవి, నీకు తెలియదేమో.. వంద రోజుల్లో వ్యవసాయానికి ఏమి చేసామో .
నువ్వు పెట్టిన వెళ్ళిన రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు విడుదల చేశామని, 85 వేల మందికి లబ్ధి చేకూరిందన్నారు..రైతులకు 80 శాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేశామన్నారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ చేశామన్నారు.
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రోజుల వ్యవధిలోనే ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేశామన్నారు నారా చంద్రబాబు నాయుడు. రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు ఇచ్చే పథకం, పునరుద్ధరణ చేశామన్నారు.
ఒక్క ఫోన్ కాల్ తో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నామని, దీని కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. పశువుల షెడ్లు నిర్మాణానికి 90 శాతం రాయితీతో పాటు రైతులకు 50 శాతం సబ్సిడీతో టార్పాలిన్లు ఇస్తున్నామని ప్రకటించారు.
రూ. 33 కోట్ల రవాణా, గోతాముల బకాయిలు విడుదల చేసామన్నారు. ఏనుగుల వల్ల పంట నష్టం నివారణకు, కర్నాటక నుంచి 6 కుంకీ ఏనుగులు తెప్పిస్తున్నామని వెల్లడించారు. వరదల్లో పంట నష్ట పరిహారం భారీగా పెంచామన్నారు. గతంలో ఎకరాకు రూ.6 వేలు ఉంటే, దాన్ని దాదాపుగా రెట్టింపు చేస్తూ, రూ.10 వేలకు పెంచామన్నారు .